- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టేషన్ ముందే రక్తం వచ్చేలా కొట్టుకున్నారు.. పోలీసులు ఏం చేస్తున్నారంటే. వీడియో
దిశ, గోదావరిఖని : పోలీసుల సాక్షిగా ఇరువర్గాలు కొట్టుకున్నారు. ఇదేమీ మొదటిసారి కాదు. కోల్‌బెల్ట్ ఏరియాలోనే అతి పెద్ద పోలీస్ స్టేషన్ అయిన గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే రక్తం కారే విధంగా వారు తన్నుకున్నారు. గోదావరిఖని గణేష్ నగర్‌కు చెందిన అసరి రాజుకు ద్వారకనగర్‌కు చెందిన దాక్షాయణికి ఏడాది క్రితం వివాహం జరిగింది. మూడురోజుల క్రితం దాక్షాయణికి కుమారుడు జన్మించగా ఆసుపత్రి వద్ద భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.
ఈ పంచాయితీ కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ బయట మాట్లాడుకోవాలని సూచించారు. బయటకు వచ్చిన ఇరువర్గాలు పోలీసుల ముందే రాళ్లతో కొట్టుకున్నారు. ఈ దాడిలో రమేష్, అజయ్ అనే వ్యక్తులు గాయపడ్డారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో ఫిర్యాదులు చేసేందుకు స్టేషన్‌కు వచ్చిన బాధితులు పరుగులు తీశారు. గత జూన్ 18న కూడా పంచాయితీలో ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. అప్పట్లో కూడా పోలీసులు పేక్షకపాత్ర వహించారని ఆరోపణలు ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం వల్లనే ఇలా జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.