మచ్చలేని నాయకుడు నర్రా రాఘవరెడ్డి

by Shyam |   ( Updated:2020-04-09 05:50:07.0  )
మచ్చలేని నాయకుడు నర్రా రాఘవరెడ్డి
X

దిశ, నల్లగొండ: ఆదర్శ నేత, మచ్చలేని ప్రజా నాయకుడు కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ అన్నారు. నర్రా రాఘవరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ పోరాటయోధుడు కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డి స్ఫూర్తితో, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం, ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

Tags : Fifth anniversary, Narra Raghava Reddy, yadadri, cpm office, nalgonda

Advertisement

Next Story

Most Viewed