ఫిఫా అండర్ – 17 మహిళా ప్రపంచకప్ వాయిదా

by vinod kumar |
ఫిఫా అండర్ – 17 మహిళా ప్రపంచకప్ వాయిదా
X

కరోనా ప్రభావంతో ఇప్పటికే ఎన్నో టోర్నీలు, ఈవెంట్లు వాయిదా పడటమో రద్దవ్వడమో జరిగింది. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఉండటం, ఆయా దేశాలు లాక్‌డౌన్ విధించడంతో క్రీడా పోటీలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో అర్థం కావడం లేదు. జూన్, జులై వరకు కరోనా ప్రభావం తగ్గుతుందని చాలా మంది భావిస్తున్నా.. ఈ ఏడాది చివరకు వరకు క్రీడా పోటీల నిర్వహణ కష్టమేననే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 2 నుంచి భారత్ వేదికగా జరగాల్సిన ఫిఫా అండర్ – 17 వరల్డ్ కప్ వాయిదా పడింది.

కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిఫా శనివారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ నవంబర్ 2 నుంచి 21 వరకు ఇండియాలోని కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్, అహ్మదాబాద్, నవీ ముంబై వేదికల్లో జరగాల్సి ఉంది. 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలిసారి భారత జట్టు కూడా ఆడుతోంది. కానీ ఇప్పడు ఈ టోర్నీ వాయిదా పడటం భారత జట్టును షాక్‌కు గురి చేసింది. కాగా, కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని ఫిఫా తెలిపింది.

tags : Fifa World cup, football, Lockdown, postponed

Advertisement

Next Story

Most Viewed