ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తాం : ఫీల్డ్ అసిస్టెంట్లు

by Sridhar Babu |
ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తాం : ఫీల్డ్ అసిస్టెంట్లు
X

దిశ, తాండూరు : ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని పెద్దేముల్ ఎంపీటీసీ అంబరయ్య, కోఅప్షన్ సభ్యులు నసీర్ అన్నారు. శనివారం పెద్దేముల్ మండల కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల కమిటీ ఆధ్వర్యంలో హుజురాబాద్ బై ఎలక్షన్ కోసం వివరాలను సేకరించారు. వారికి స్థానిక ఎంపీటీసీ అంబరయ్య, మండల కో ఆప్షన్ సభ్యులు నసిరుద్దీన్ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో అట్టడుగు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం సరికాదన్నారు. అనంతరం మండల ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ.. హుజురాబాద్ బై ఎలక్షన్‌లో మండలానికి ఇద్దరు చొప్పున 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లుతో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు.

సేకరించిన విరాళాలతో హుజురాబాద్ బై ఎలక్షన్లలో నామినేషన్ల కోసం ఖర్చు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల మండల ఉపాధ్యక్షులు బోయిని వెంకటయ్య, పలు గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు గోపాల్, కృష్ణ, ఆనందం, గోపాలకృష్ణ, నవీన్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story