- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫీల్డ్ అసిస్టెంట్లు అరెస్టు
దిశ, మెదక్: మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కారించాలని 15 రోజుల ముందే డిమాండ్ లెటర్లను ప్రభుత్వానికి అందజేశామని, అయినా కూడా తమపై నిర్బంధాలు ప్రయోగించి అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. సీఎం కేసీఆర్ నర్సాపూర్ లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు నిరసన కార్యక్రమం చేపట్టడంతో పోలీసులు వారిని ముందుస్తుగా అరెస్టు చేశారు. దీనిని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్య పరిష్కారం కోరుతుంటే ప్రభుత్వమెమో ఫీల్డ్ అసిస్టెంట్లను తాత్కాలికంగా విధుల నుండి సస్పెండ్ చేస్తూ 47 79 జీవో ను విడుదల చేసిందంటూ మండిపడింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో 15 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనిమిది వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వహించారని, ఇప్పుడు వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకనైనా ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యను పరిష్కరించేలా చూడాలని సీఐటీయూ విజ్ఞప్తి చేసింది.