- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులను మోసం చేస్తున్న ఫెర్టిలైజర్ కంపెనీలు
దిశ, హుస్నాబాద్ : రైతన్న కష్టాలు వర్ణనాతీతం. ఓ సారి కాలం కరువును తెస్తే.. మరోసారి వర్షాలు ముంచెత్తుతాయి. ఇటువంటి సమయాల్లో కూడా రైతులు ఎన్నో నష్టాలను చవి చూస్తూ పంటలను సాగు చేస్తునే ఉంటారు. దీనికి తోడు ఎరువుల కొరతతో కాస్తా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ఎరువులు లభించినా.. వాటి తూకంలో కూడా రైతులు నష్టపోతున్నారు.
ఎరువుల కంపెనీలు లాభం చూసుకుంటూ రైతుల పొట్ట కొడుతున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఓ రైతు 50 కిలోల ఎరువుల బస్తా కొన్నాడు. అయితే బరువు తక్కువగా ఉందని అనుమానం వచ్చిన రైతు మరోసారి తూకం వేశారు. దాంట్లో ఏకంగా ఏడు కిలోలు తగ్గి 43 కిలోలు మాత్రమే ఉందని తేలింది. దీంతో ఎరువుల తూకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. చాలా మంది రైతులు ఇది గమనించక నష్టపోతున్నారని చెప్పారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.