- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా మరణాలు మహిళల్లోనే ఎక్కువా?
దిశ, వెబ్ డెస్క్: ఇండియాలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతూ ఉంది. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం దేశవ్యాప్తంగా ప్రతిరోజు 9 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారిలో మగవారితో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఉన్నారని గ్లోబల్ హెల్త్ సైన్సెస్ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఓ అధ్యయనంలో తేలింది.
మే 20 వరకు ఉన్న లెక్కల ప్రకారం కరోనా సోకిన పురుషుల్లో 2.9 శాతం మరణాలుండగా.. మహిళల్లో 3.3 శాతం వరకు ఉన్నట్లు తేలింది. మరణాల రేటు పక్కన పెడితే.. కొవిడ్ బారిన పడినవారిలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. 66 శాతం మంది పురుషులు కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురికాగా..
మహిళల్లో 34 శాతం మందికి ఈ వైరస్ సోకింది.
అయితే పురుషులైనా, మహిళలైనా.. అధిక వయసు గల వారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలిపారు.