దొంగలను ధైర్యంగా పట్టుకున్న మహిళా జర్నలిస్ట్..!

by Shamantha N |   ( Updated:2020-09-14 07:02:26.0  )
దొంగలను ధైర్యంగా పట్టుకున్న మహిళా జర్నలిస్ట్..!
X

దిశ, వెబ్‎డెస్క్: దొంగతనం చేసేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను ఓ మహిళా జర్నలిస్టు పట్టుకుంది. ఈ ఘటన శనివారం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. దూరదర్శన్‎లో పనిచేస్తోన్న మహిళా జర్నలిస్ట్.. మాలవీయ నగర్ వెళ్లడానికి ఆటో ఎక్కింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‎పై వచ్చి ఆమె చేతిలోని మొబైల్‎ను తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ సదరు మహిళ ధైర్యంగా వారిని వెంబడించింది. దీంతో నిందితులు పోలీసు బారికేడ్లకు తగిలి కిందపడ్డారు. ఆటో డ్రైవర్ సాయంతో నిందితులను దగ్గరలోని పోలీసులకు అప్పగించింది మహిళా జర్నలిస్ట్. నిందితులది తుగ్లకాబాద్‎కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కాగా, దొంగలను వెంబడించి పోలీసులకు అప్పగించినందుకు మహిళా జర్నలస్ట్‎ను అధికారులు అభినందించారు.

Read Also…

దేశంలో కొత్తగా… 7 బుల్లెట్ రైళ్లు

Advertisement

Next Story