స్లాట్ రద్దయితే ఫీజు రిటర్న్.. కండిషన్స్ అప్లై!

by Shyam |   ( Updated:2021-03-20 09:40:07.0  )
స్లాట్ రద్దయితే ఫీజు రిటర్న్.. కండిషన్స్ అప్లై!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ధరణి పోర్టల్​ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుక్​చేసుకొని అనివార్య కారణాలతో రద్దు చేసుకుంటే ఆర్నెళ్ల లోపు ఫీజు వాపసు చేయాలని అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్ల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్​ద్వారా చెల్లించిన స్టాంపు డ్యూటీని వాపసు చేయనున్నారు.

ఇప్పటి వరకు ధరణి పోర్టల్‌లో ఈ ఆప్షన్​లేకపోవడంతో స్లాట్లు రద్దు చేసుకున్న వారు చెల్లించిన సొమ్ముపై సంశయం కొనసాగింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో సమస్యకు పరిష్కారం లభించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్టాంప్స్​అండ్​రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి ఇప్పించే బాధ్యతను కలెక్టర్లపై పెట్టారు. ఆర్నెళ్లు దాటితే ఆ బాధ్యతను రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చూస్తారు.

Advertisement

Next Story

Most Viewed