- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ కేబినెట్‌లో డేంజర్ బెల్స్.. ఈటల ఎఫెక్టేనా..!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కేబినెట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈటల వ్యవహారంతో కొంతమంది మంత్రుల్లో వణుకు పుడుతోంది. ఇప్పటి వరకు లేని విధంగా మంత్రి ఈటలపై భూ కబ్జాల ఆరోపణలు రావడం, వాటిపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించడం, గంటల వ్యవధిలోనే దానిపై అధికారులు తేల్చడం చకచకా జరిగిపోతున్నాయి. ఈ పరిణామాలు పలువురు మంత్రులకు గుచ్చుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే భూ కబ్జాలు, బెదిరింపుల ఆరోపణలు బహిరంగంగానే వెల్లడయ్యాయి. ఇదే సాకుతో ఎవరికి ఎసరు పెడుతారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తే… ఒక్కరినే కాకుండా భూ దందాల ఆరోపణలున్న మంత్రులకు కూడా ఉద్వాసన ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీఎం కేసీఆర్కు సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ కూడా దీనిలో చక్రం తిప్పుతున్నారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రగతిభవన్ వేదికగా జరుగుతున్న ఈ తతంగంలో సీఎం కేసీఆర్, సదరు ఎంపీతో పాటు ఇద్దరు, ముగ్గురు ఉన్నతాధికారులే నివేదికలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇక భూ కబ్జాల ఆరోపణలు రాష్ట్ర మంత్రులకే కొత్తేం కాదు. ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిని ఆనుకుని ఉండే ఓ మంత్రిపై బహిరంగంగా విమర్శలు వచ్చాయి. ఆడియో రికార్డులు బయటకు వచ్చాయి. మరో మంత్రి కూడా భూవివాదాల్లో ఇరుక్కున్నారు. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా మంత్రివర్గంలోకి తీసుకున్న మరొకరిపై కూడా ఆరోపణలున్నాయి. మంత్రి కేటీఆర్ వర్గం అంటూ చెప్పుకుంటూ భూ కబ్జాల్లో తలదూర్చారని అంతేకాకుండా పలు భూముల్లో మంత్రి కేటీఆర్, తాను భాగస్వాములమంటూ కొన్నిచోట్ల చెప్పుకుంటున్నట్లు ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి. సదరు మంత్రి తమ్ముడి చేతుల మీదుగా భూ వ్యవహారాలు నడిపిస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి.
ఇలాంటి పరిణామాల్లో కేవలం భూ కబ్జా… అసైన్డ్ భూమిని కబ్జా చేశారనే ఆరోపణలతో మంత్రి ఈటలపై విచారణ మొదలైంది. కానీ కొంతమంది మంత్రులు పదుల సంఖ్యలో ఎకరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని, కొన్నిచోట్ల బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీంతో కేబినెట్‌లో మార్పులు ఉంటాయా… ఉంటే ఎవరి కుర్చీకి ఎసరు ఉంటుందనే భయంలో ఉంటున్నారు