- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్టీప్లేయర్ యాక్షన్ ‘ఫౌజీ’ రిలీజ్
దిశ, వెబ్‌డెస్క్: గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ ‘ఫౌజీ’ 72వ గణతంత్ర దినోత్సవ కానుకగా విడుదల అయింది. కాగా, ఈ గేమ్‌ని అందరికంటే ముందే డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ప్రీ-రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇప్పటివరకు 4 మిలియన్ల మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే గేమ్ అందుబాటులోకి వచ్చింది. ఐఓఎస్ కస్టమర్లు ఈ గేమ్ కోసం మరింత కాలం వెయిట్ చేయాల్సిందే.
‘ఫౌజీ’..ప్రధాని మోడీ కోరుకుంటున్న ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతిరూపం. ఇది కేవలం వినోదాన్ని అందించే గేమ్ మాత్రమే కాకుండా, సైనికుల త్యాగాలను గుర్తు చేసేలా రూపొందించారు. గేమ్‌పై వచ్చిన ఆదాయంలో 20 % సైనికుల సంక్షేమానికి సంస్థ కేటాయిస్తుందని ఎన్ కోర్స్ సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఫౌజీ గేమ్ క్యాంపెయిన్ మోడ్‌లో ఆడేందుకు వీలు ఉండగా, బ్యాటిల్ రాయల్ మోడ్, పీవీపీ మల్టీప్లేయర్ మోడ్ త్వరలో లాంచ్ చేయనున్నట్లు ఎన్ కోర్ గేమ్స్ ప్రతినిధులు తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్‌లో 4.6 రేటింగ్‌తో దూసుకుపోతుండగా, ఫేక్ యాప్స్ పట్ల అప్రమత్తత అవసరం. ‘ఫౌజీ : ఫియర్‌లెస్ అండ్ యూనైటెడ్ గార్డ్స్’ అనే టైటిల్‌తో పాటు డెవలపర్ నేమ్ ‘స్టూడియో ఎన్‌కోర్ ప్రైవేట్ లిమిటెడ్’(Studio nCore Pvt Ltd) చెక్ చేసి గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫౌజీ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే 450 ఎంబీ – 500 ఎంబీ అవసరం. ఓరియో లేదా ఆపై ఉన్న ఓఎస్‌లలో మాత్రమే దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గేమ్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఉచితమే. కానీ, అప్‌గ్రేడ్స్ కోసం చార్జీలు చెల్లించాలి.
ఫౌజీ స్టాండర్డ్ వెర్షన్‌కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ఆధారంగా ఫౌజీ లైట్ వెర్షన్ తీసుకు వచ్చే యోచనలో ఎన్ కోర్స్ ఉంది. ఒకవేళ ఫౌజీ లైట్ వస్తే, మిడ్ రేంజ్, లోయర్ మిడ్ రేంజ్ ఫోన్లలో కూడా ఫౌజీ గేమ్ ఆడటానికి వీలుంటుంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే.. పబ్‌జీ, ఫౌజీలు రెండు వేర్వేరు గేమ్స్. గత నాలుగు దశాబ్దాలలో చైనా, భారతదేశం మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా ఫౌజీ గేమ్‌ను ఓ గేమింగ్ సిరీస్‌లా తీసుకొచ్చారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ గేమ్‌కి మెంటార్‌గా వ్యవహరిస్తుండగా, బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్ గేమ్స్ అనే గేమింగ్ సంస్థ ఫౌజీని రూపొందించింది.