నాలాంటి నాన్న అందరికీ ఉండాలి..

by Shyam |
నాలాంటి నాన్న అందరికీ ఉండాలి..
X

‘నాన్న.. నిరంతరం పిల్లల కోసం కష్టపడే యంత్రం. ప్రోత్సాహాన్నందించి ముందుకు నడిపే స్నేహం.. కష్టాల్లో నేనున్నాననే భరోసా’. నాన్న చేతి స్పర్శ కొండంత ధైర్యాన్నిస్తుంది. నాన్న చెప్పే మాట ముళ్ల బాటైనా సరే.. గమ్యానికి చేరగలమన్న నమ్మకాన్ని పంచుతుంది. విలువ కట్టలేని ప్రేమ వారి సొంతం. ఈరోజు (ఆదివారం) ఫాదర్స్ డే సందర్భంగా సెలబ్రిటీలు వారి తండ్రులతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసున్నారు. తమ తమ జీవితాల్లో నాన్నకున్న ప్రాధాన్యతను అభిమానులతో పంచుకున్నారు. తప్పటడుగులు వేసే సమయం నుంచి అసలు అందకుండా పరుగులు తీస్తున్న సమయం వరకు.. నాన్న అందించిన ప్రోత్సాహం గురించి వివరిస్తున్నారు.

ఫాదర్స్ డే సందర్భంగా తండ్రీ కొడుకుల ఫొటోను షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ‘చిరుతతో చార్మింగ్ డాడీ’ అనే క్యాప్షన్‌తో పెట్టిన పోస్ట్‌లో చిరు తన తండ్రి, చరణ్ నవ్వుల గురించి వర్ణించారు. ‘మా నాన్న నవ్వు.. నా బిడ్డ చిరునవ్వు.. రెండూ నాకు చాలా ఇష్టం’ అంటూ ఫాదర్స్ డే విషెస్ తెలిపారు. ఇక కొన్ని బంధాల గురించి తెలిపేందుకు మాటలు సరిపోవన్న చరణ్.. తండ్రికి విష్ చేస్తూ తనకు ఇష్టమైన ఫొటోలను షేర్ చేశాడు.

ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలిపారు మహేష్ బాబు. దృఢమైన, ప్రేమ, దయ, శ్రద్ధ ఈ పదాలు మా నాన్న గురించి వివరించగలవు.. కానీ తన గురించి చెప్తూపోతే పదాలు కూడా దొరకవని చెప్పాడు మహేష్. ‘నేను కూడా నా తండ్రి మాదిరిగానే నా పిల్లలతో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను’ అని తెలిపాడు. తన తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రిన్స్.. ‘మీరే నాకెప్పుడూ ఆదర్శం, నేను ఎంచుకునే మార్గం’ అని చెప్పాడు.

https://twitter.com/urstrulyMahesh/status/1274544950382694402?s=19

‘ఒక తండ్రి కన్నీళ్లు, భయాలు మనకు కనిపించవు.. తన ప్రేమను వివరించలేం’ అని చెప్పింది అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్. కానీ తన పిల్లల సంరక్షణలో మునిగిపోయి.. వారికి ఒక పిల్లర్‌లా బలాన్నిస్తాడని చెప్పింది. ఆశావాదం, ఆత్మ విమర్శ, ఆధ్యాత్మికత, మనస్సాక్షితో బతకాలని నేర్పే తండ్రికి నేను జన్మించినందుకు గర్వపడుతున్నానని తెలిపింది. అన్ని వేళలా లవ్, సపోర్ట్ ఇచ్చిన నాన్న.. తనకు వారసత్వంగా విలువలు ఇచ్చాడని చెప్పింది. ‘మీ వల్లే ఇంత గొప్ప జీవితాన్ని పొందాను.. నా లైఫ్‌లో సూపర్ హీరోలకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ అంటూ విష్ చేసింది.

View this post on Instagram

“A father’s tears and fears are unseen, his love is unexpressed, but his care and protection remain as a pillar of strength throughout our lives.” – Ama H. Vanniarachchy I’m blessed to be born to a father who has taught me the value of integrity, morals, progressive ideas and the importance of work ethic, I’m lucky enough to marry into a family where my father in law leads by example with his optimism, spirituality and doing everything he does with an unbeatable conscience. Both of them have given me unconditional love and support. And they’ve both started with nothing and reached stars and have done everything to give their children whatever they need so they don’t have to face the same trials they faced. But our most important inheritance is the values that they have passed down. Happy Father’s Day to the super heroes in my life.. I am because of you.

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

‘నా తండ్రి, నా స్నేహితుడికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ అని తెలిపింది అలియా భట్. నాకు కావాల్సి వచ్చినప్పుడు రాక్ మాదిరి సపోర్ట్ ఇస్తూ.. నేను ప్రవహించాల్సి వచ్చినప్పుడు నీటిలా సహాయపడుతూ.. ఎగరాలి అనుకున్నప్పుడు గాలిలా ముందుకు నడిపిస్తూ.. ఇన్ని విధాలుగా ఎలా ఉండగలుగుతున్నావ్? అని ఆశ్చర్యపోతున్నా నాన్న అని తెలిపింది. మీలా ఎవరూ లేరేమో.. ఉండరేమో అన్న అలియా.. తనను ఇంత గొప్పగా తయారు చేసిన తండ్రికి ధన్యవాదాలు చెప్పింది.

‘అమ్మాయిలందరూ నా లాంటి తండ్రిని కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని తెలిపింది అనుష్క శర్మ. ఫాదర్స్ డే సందర్భంగా బెంగళూరులో తనను కాలేజ్‌లో డ్రాప్ చేసే సమయంలో తండ్రితో జరిగిన సంభాషణను పంచుకుంది.
డాడీ – జీవితంలో ఎంత కష్టపడినా సరే.. తప్పు మాత్రం చేయొద్దు.. ఎప్పుడూ సరైన మార్గాన్నే ఎంచుకోవాలి.. అప్పుడే శాంతిగా, సంతోషంగా ఉండగలవు.
అనుష్క – కానీ నేను చేసే పని తప్పో? ఒప్పో? ఎలా తెలుస్తుంది?
డాడీ – ఇందుకోసం జ్ఞానం కావాలి. తప్పు ఒప్పు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకునే ఆ జ్ఞానం కోసం దేవుణ్ణి ప్రార్థించు.. సరైన దారిని ఎంచుకునే బలాన్ని ఇవ్వమని కోరుకో..
డాడీ చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అని చెప్తోన్న అనుష్క శర్మ.. ఇందుకోసం ప్రతీ రోజూ ప్రార్థిస్తున్నా అని తెలిపింది.

https://www.instagram.com/p/CBr2t5PJbjy/?igshid=157yd33fh7189

Advertisement

Next Story

Most Viewed