- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Fathers day :త్యాగానికి ప్రతిరూపం నాన్న..
దిశ, వెబ్‌డెస్క్: నాన్న.. ఈ పేరు వినగానే చిన్నప్పుడు మనల్ని భుజాలపై ఎత్తుకొని ఆడించిన రోజులే గుర్తొస్తుంటాయి. పిల్లల జీవితాల కోసం తన లైఫ్‌ను త్యాగం చేసే వ్యక్తుల్లో తండ్రి ఎప్పుడూ ముందే ఉంటాడు. జీవితంలో తాను కోల్పోయినవి, తాను సాధించాలనుకొని మిగిలిపోయిన కళలన్నీ పిల్లలు నెరవేర్చేలా వాళ్లకు అడిగినవన్నీ సమకూర్చుతారు. పెరిగి, ఎదిగిన తర్వాత మనం పేరెంట్స్‌కి ఏం ఇస్తామో గానీ… తల్లిదండ్రులుగా వారు మాత్రం ఏలోటూ రాకుండా పిల్లలకు అన్నీ ఇచ్చేస్తారు. ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచి, మళ్లీ పిల్లలు పడుకున్న తర్వాత వచ్చి, తనకష్టం ఏమాత్రం పిల్లలకు తెలియకుండా.. ఆ కష్టం మళ్లీ పిల్లలకు రాకుండా, నిద్రాహారాలు మానేసి కష్టపడుతుంటాడు తండ్రి.
కంటినిండా నిద్రపోలేడు. ఇంటి బాధ్యతలను ఒంటి స్తంభంలా మోస్తూ తన సంపాదనంతా కుటుంబానికే వెచ్చిస్తాడు. పిల్లల భవిష్యత్తు నిరంతరం తాపత్రయ పడతాడు. అటువంటి నాన్నకు కూడా సమాజంలో అమ్మతో సమానమైన గుర్తింపు ఉండాలనే తలంపుతో 1910 జూన్‌లో మూడో ఆదివారం తొలిసారిగా ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులిద్దరికీ సమాన పాత్ర ఉన్నప్పటికీ తల్లికి లభించిన గుర్తింపు నేటికీ తండ్రికి లభించడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఫాదర్స్ డే మూలానా తండ్రి ప్రత్యేకంగా ఆలోచిండంతో వారికి సంతృప్తినిచ్చేలా పిల్లలంతా తండ్రులతో గడిపి, ఫాదర్స్ డేను సెలబ్రేట్ చేస్తున్నారు.