- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చిన్నారులకు విషమిచ్చిన తండ్రి.. కారణం ఇదే!

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ :
ఆడపిల్లలు పుట్టారనే కోపంతో ఓ తండ్రి కవల పిల్లలకు విషం తాగించాడు. ఇదివరకే ఓ ఆడపిల్లకు జన్మినిచ్చిన ఆయన.. రెండో కాన్పులోనూ ఇద్దరు ఆడపిల్లలు పుట్టే సరికి భరించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి బెడ్ మీదే ఎవరూ లేని సమయం చూసి కవల పిల్లలకు విషం తాగించాడు. ఈ విషాదకర ఘటన మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలంలో శుక్రవారం వెలుగులోకివచ్చింది.
వివరాల్లోకివెళితే.. మండలంలోని దేశాయిపల్లికి చెందిన కృష్ణవేణి, కేశవుల దంపతులకు ఈనెల ఒకటో తేదీ రాత్రి కవల ఆడపిల్లలు జన్మించారు. రెండో కాన్పులోనూ ఆడశిశువులే పుట్టారని కేశవులు ఆవేదన చెందాడు. దీంతో భార్యకు తెలియకుండా చిన్నారులకు పురుగుల మందు తాగించాడు. పిల్లలు అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో ఆ శిశువులను పిల్లల దవాఖానలో అడ్మిట్ చేశాడు.
పరిశీలించిన వైద్యులు వారిద్దరికీ పాయిజన్ అయినట్లు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానకు శిశువులను తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై ఆరా తీశారు. అయితే, చిన్నారుల తండ్రి పురుగుల మందు డబ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ మేరకు అతన్ని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నారులు జిల్లా కేంద్ర దవాఖానలో చికిత్స పొందుతున్నారు.