కన్న తండ్రే కొడుకుపై పెట్రోల్ పోసి..

by srinivas |   ( Updated:2020-08-15 05:41:39.0  )
కన్న తండ్రే కొడుకుపై పెట్రోల్ పోసి..
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. సామాజాన్ని రక్షించే బాధ్యతలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ తన బాధ్యతను విస్మరించి కన్న కొడుకు పట్ల కిరాతకంగా వ్యవహరించాడు. తన అక్రమ సంబంధం గురించి ప్రశ్నించాడనే నెపంతో కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటన జిల్లాలోని కొండా వెంకటప్పయ్య కాలనీలో శనివారం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. హెడ్ కానిస్టేబుల్ భార్య ఇటీవల మరణించడంతో అతను వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ విషయం తెలియడంతో కొడుకు తండ్రిని నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి కన్న కొడుకుపైనే పెట్రోల్ పోసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే స్థానికులు ఆ యువకుడిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కాలిన గాయాలతో బాధితుడు జిల్లాలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story