మద్దతిచ్చిన తండ్రి.. ప్రత్యర్థిగా మారిన తనయుడు

by Sridhar Babu |
gellu-father-and-son
X

దిశప్రతినిధి, కరీంనగర్: 17 ఏళ్ల కిందట తండ్రి ప్రత్యర్ధిగా నిలిస్తే.. ఇప్పుడు తనయుడు ఎన్నికల బరిలోకి దిగాడు. అయితే, కొన్ని అనివార్య కారణాల వలన తండ్రి ఈటలకు మద్దతిస్తే.. నేడు కొడుకు సవాల్ విసురుతున్నాడు. నాడు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈటల పోటీ చేయగా ప్రత్యర్థిగా తండ్రి నిలిచాడు.. నేడు తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ కొడుకు బరిలో నిలిచాడు. దీంతో హుజురాబాద్ ఎన్నికల ముఖచిత్రంలో సరికొత్త అధ్యాయనం మొదలైంది.

2004లో ఈటల రాజేందర్ తొలిసారిగా కమలాపూర్ నుండి పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈటలపై ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెల్లు మల్లయ్య యాదవ్ నిలబడ్డారు. ఎన్నికల కమిషన్ మల్లయ్యకు గొడ్డలి గుర్తు కేటాయించింది. ఐదు రోజుల పాటు గ్రామగ్రామాన తిరుగుతూ మల్లయ్య యాదవ్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో ఈటల రాజేందర్ మల్లయ్య యాదవ్‌ను మెప్పించి, ఒప్పించి పోటీ నుండి తప్పుకునేలా చేశారు. అప్పటినుండి మల్లయ్య యాదవ్ ఈటల గెలుపుకోసం ప్రచారం చేశారు. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో గెల్లు మల్లయ్య తనయుడు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అయితే, తండ్రి మల్లయ్య కమలాపూర్ నుండి ఈటలకు ప్రతర్థిగా బరిలో నిలిస్తే.. నేడు కొడుకు శ్రీనివాస్ యాదవ్ హుజురాబాద్ నుండి ప్రత్యర్థిగా మారారు. అంతేకాకుండా నాడు ఈటల ఉద్యమ పార్టీ అభ్యర్థి కాగా, నేడు ఆయన బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాత్రం అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story