కాపాడాల్సిన తండ్రే.. తాగి వచ్చి కూతురును..

by Shyam |   ( Updated:2021-12-07 09:19:55.0  )
father
X

దిశ, నల్లగొండ: కంటికి రెప్పలా కాపాడల్సిన తండ్రే కన్న కూతురిని లైంగికంగా వేధిస్తున్న ఘటన నల్లగొండ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తాగుడుకు బానిసయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాగి వచ్చి సొంత కుమార్తెపై లైంగిదాడికి పాల్పడుతున్నాడు. అంతేకాకుండా కుమార్తెకు వచ్చిన వివాహ సంబంధాలను చెడగొడుతూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడు. తండ్రి ప్రవర్తనతో విసుగు చెందిన బాధితురాలు నల్లగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ నిందితుడిని ఆరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు.

Advertisement

Next Story