నిద్ర మాత్రలు ఇచ్చి కన్నకూతురిపై..

by Shamantha N |
నిద్ర మాత్రలు ఇచ్చి కన్నకూతురిపై..
X

తండ్రి అనే పదానికే మాయని మచ్చతెచ్చాడు ఓ ప్రబుద్దుడు. వావి వరసలు మరచి, కన్న కూతురు కరోనా లక్షణాలతో బాధపడుతోందన్న కనికరం లేకుండా అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. బెల్లందూరుకు చెందిన 41 ఏళ్ల రాకేష్‌కు మొదటి భార్యతో గొడవ పడి రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కూతురు(19) నెల రోజుల క్రితం తండ్రి దగ్గరకు వచ్చింది. ఈ క్రమంలో గత మూడు రోజుల నుంచి యువతి కరోనా లక్షణాలతో బాధపడుతుంది.

కరోనా ట్యాబ్లెట్లు అంటూ తండ్రి నిద్ర మాత్రలు ఇచ్చాడు. దీంతో అవి వేసుకున్న యువతి గాఢ నిద్రలోకి జారుకుంది. అనంతరం ఆమెపై తండ్రి అత్యాచారం చేశాడు. నిద్ర నుంచి తెరుకున్న యువతి కన్నతండ్రే తనపై అత్యాచారం చేయడంతో కన్నీరుమున్నీరైంది. జరిగిన విషయం సవతి తల్లికి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో యువతి తన స్నేహితురాలి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Next Story