- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Crime News: ఆరునెలలుగా కూతురిపై తండ్రి అత్యాచారం.. సపోర్ట్ చేసిన తల్లి..?
దిశ, ఏపీ బ్యూరో: తండ్రి స్థానంలో ఉన్నాడు. వావి వరసలు మరచిపోయి మానవమృగంలా మారాడు. కూతురును కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి కామాంధుడిలా మారి చెరబట్టాడు. భయపెట్టి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు నెలలుగా నరకం చూపిస్తూ కోరిక తీర్చుకుంటున్నాడు. పినతండ్రి ఘాతుకాలపై తల్లికి చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆ దుర్మార్గుడు మరింత రెచ్చిపోయాడు. ఈ ఆదివారం కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడుతుండగా ఆమె తమ్ముడు చూసి కేకలు వేయగా స్థానికులు వచ్చారు. దీంతో అసలు గుట్టు రట్టైంది. జనాలు రావడంతో ఆ కీచకుడు పరారయ్యాడు. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో దళితవాడకు చెందిన అంజయ్య తన భార్యతో విడిపోయాడు. తర్వాత మరో మహిళను పెళ్లాడాడు. ఆమెకు అప్పటికే 10 ఏళ్ల కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉంది. పెళ్లైన నాటి నుంచి ఆ మహిళ తన ఇద్దరు బిడ్డలతో కలిసి అంజయ్యతోనే కలిసి ఉంటుంది. కామంతో కళ్లుమూసుకుపోయిన అంజయ్య 14 ఏళ్ల కుమార్తెపై కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ బాలికని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. పినతండ్రి అరాచకాలను బాలిక తల్లికి చెప్పింది. అయినా తల్లి చూసీచూడనట్లుగా వ్యవహరించింది. దీంతో అతడు మరింత రెచ్చిపోయాడు. యువతిపై లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడు.
అయితే ఈనెల 19న ఇంట్లో ఎవరూలేని సమయంలో చూసి బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె సోదరుడు చూసి గట్టిగా కేకలు వేశాడు. దీంతో స్థానికులు ఇంటి వద్దకు చేరుకుని ఆరా తీయగా అసలు గుట్టు రట్టైంది. దీంతో అంజయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానిక మహిళా సంఘం నాయకురాలు మునేశ్వరి, ఐసీడీఎస్ సీడీపీవో జ్యోతి, వలంటీర్ల సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కామాంధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటరాజేశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి మంగళవారం రాత్రి బాధితుల నివాసం వద్దకు స్వయంగా చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.