- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం మత్తులో కొడుకు.. దారుణానికి ఒడిగట్టిన తండ్రి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకును తండ్రి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. నగరంలోని శివాజీ నగర్ ప్రాంతానికి చెందిన ఏలుగం రమేష్ తన కన్న కొడుకుని దారుణంగా కత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ సత్యనారాయణ, టూ టౌన్ ఎస్ఐ సాయినాథ్‌లు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా టౌన్ సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ.. కొడుకు ప్రవీణ్ రోజు తప్పతాగి ఇంట్లో నాన హంగామా చేసేవాడని తెలిపారు. అయితే బుధవారం రాత్రి సమయంలో కొడుకు గొడవకు దిగగా, విసిగిపోయిన తండ్రి రమేష్ అర్థరాత్రి కొడుకు నిద్రిస్తున్న సమయంలో కత్తితో తలపై బాది దారుణంగా హత్య చేశారన్నారు. ఈమేరకు తండ్రి రమేష్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు టౌన్ సీఐ పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే ప్రవీణ్‌కు గత రెండు సంవత్సారాల క్రితం వివాహం అయింది.