కసాయి తండ్రి.. మద్యం మత్తులో సొంత కొడుకునే..

by Shyam |   ( Updated:2021-12-06 10:43:16.0  )
boy
X

దిశ, నేరేడుచర్ల: మద్యానికి బానిసైన వ్యక్తి కన్న కుమారుడి‌పై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన గరిడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. గరిడేపల్లి ఎస్సై కొండల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలంలోని వెల్దండ గ్రామానికి చెందిన సురేష్, మాధురి దంపతులకు ముగ్గురు సంతానం. సురేష్ తరుచూ మద్యం తాగి వచ్చి భార్య మాధురితో పాటు పిల్లలను మానసికంగా వేధిస్తుండేవాడని తెలిపారు. భార్య మాధురి ఆదివారం పనికి వెళ్తూ సంవత్సర వయసు గల కుమారుడిని భర్త సురేష్ వద్ద ఉంచి వెళ్ళింది.

తాగి వచ్చిన సురేష్ మద్యం మత్తులో బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో బాలుడి ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలుడి తల్లి సురేష్ తరచూ తాగి వచ్చి తనను, పిల్లలను వేధిస్తున్నాడని, అలాగే సురేష్ తల్లి కూడా వేధిస్తోందని ఇద్దరిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కొండల్ రెడ్డి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story