- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అన్నదమ్ములతో శృంగారం.. డబ్బులివ్వలేదని కేసు పెట్టిన ఆంటీ’
దిశ ప్రతినిధి , హైదరాబాద్: కవ్వించే మాటలతో యువకులకు దగ్గరై అనంతరం డబ్బులు డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లలో వరుస కేసులు పెడుతున్న కిలేడీపై చర్యలు తీసుకుని తన ఇద్దరు కుమారులను రక్షించాలని బుధవారం ఓ తండ్రి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ నూనూగు మీసాల యువకులనే టార్గెట్ చేసుకుని వలపు వల విసిరి.. వారిని ముగ్గులోకి దింపి అన్నీ అయిపోయాక డబ్బుల కోసం కేసులు పెడుతూ.. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన ఆమెపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు కావాలంటూ అందినకాడికి దోచేస్తోందని, ఇవ్వకుంటే కేసులు పెట్టి జైలుకి పంపిస్తున్న కేరళ కుట్టి శృంగార లీలలపై బాధితుల తండ్రి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడం సంచలనంగా మారింది.
రంగారెడ్డి జిల్లా మౌలాలి ఇంద్రానగర్ హౌసింగ్ బోర్డులో ఉండే కార్పెంటర్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 2015 సంవత్సరంలో తాము ఉండే కాలనీకి కేరళకు చెందిన ఓ మహిళ భర్త, ఇద్దరు పిల్లలతో వచ్చి అద్దెకు ఉంటున్నట్లు తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే సదరు మహిళ తన చిన్న కుమారుడు (17)ను ట్రాప్ చేసిందని, అడిగిన డబ్బులు ఇవ్వనందుకు కేసు పెట్టి జైలుకు పంపిందన్నారు. దీంతో సదరు మహిళ సెక్స్ రాకెట్ నడుపుతూ.. డబ్బులు గుంజుతోందని పలుమార్లు కుషాయిగూడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు. అయినా పోలీసులెవరూ తమను పట్టించుకోలేదన్నారు. ఇలా చిన్నకుమారునిపై ఉన్న కేసు విషయం తేలకముందే వివాహమైన పెద్ద కుమారుడు కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు పెట్టిందన్నారు. ప్రస్తుతం పెద్ద కుమారునిపై మల్కాజ్‌గిరి కోర్టులో నేటికీ కేసు నడుస్తోందన్నారు.
కేరళ నుంచి వచ్చిన మహిళ.. ఆమె భర్తతో కలిసి మేల్ ప్రాస్టిట్యూషన్ నడుపుతున్నారనే ప్రచారం స్థానికంగా జరుగుతోందని ఆయన చెప్పారు . పోలీసులతో స్నేహంగా ఉంటూ డబ్బుల కోసం యువకులపై తప్పుడు కేసులు పెడుతోందని, ఇవ్వని వారిని జైలుకు పంపుతోందని ఆయన వాపోయారు . ఈ నేపథ్యంలో కీసర పోలీస్ స్టేషన్ ఓ కానిస్టేబుల్, మరో యువకుడు కన్పించకుండా పోయారని, వీరి అదృశ్యం వెనుక మహిళ హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలా ఎక్కడికి వెళితే అక్కడ యువకులకు వలపు వల విసురుతూ మోసాలకు పాల్పడిన కిలేడీతో పాటు ఆమెకు సహకరిస్తున్న భర్తపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. ఆయన చేసిన ఫిర్యాదును విచారణకు స్వీకరించిన హెచ్ఆర్సీ నవంబర్ 10వ తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని రాచకొండ పోలీస్ కమిషనర్‌కి ఆదేశాలు జారీ చేసింది.