- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిజిస్ట్రేషన్ ఆఫీసులో పరువు హత్య
దిశ, వెబ్ డెస్క్: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కులాలు వేరు.. మతాలు వేరు.. ఇంట్లో తెలిస్తే చంపేస్తారని తెలుసు.. అయినా తెగించారు.. ప్రేమకోసం ఇల్లు వదిలి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.. కానీ వారి ప్రేమ వారి తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. ప్రేమ కన్నా కులానికే విలువనిచ్చే వారి పెద్దరికం సొంత బిడ్డలనే వివేకాన్ని చంపేసింది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఓ తండ్రి తన కూతురు భర్తను అతికిరాతకంగా నరికిచంపాడు. అంతేకాకుండా కూతుర్ని కిడ్నాప్ చేసి.. చిత్రహింసలకు గురిచేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూర్ జిల్లా మాదంబట్టి సమీపంలోని కుప్పనూర్‌కు చెందిన భగవతి కుమార్, హరిప్రియ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి సామాజిక వర్గాలు వేరు కావడంతో యువతి కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయి రెండు నెలల క్రితం ఓ ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆతర్వాత వారు ఎవరికి కనిపించకుండా జిల్లా సమీపంలోని ఓ గ్రామంలో నివాసం ఉంటున్నారు. అయితే తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకొనేందుకు కోయంబత్తూర్ తొండాముత్తుర్ కార్యాలయంలో పత్రాలు సమర్పించారు. గురువారం ఫొటో తీయడం కోసం అధికారులు కార్యాలయానికి పిలవడంతో ఇద్దరూ కార్యాలయానికి వచ్చారు. వారు కార్యాలయానికి రావడం తెలుసుకున్న హరిప్రియ తల్లిదండ్రులు. భగవతి కుమార్ ను నరికి, హరిప్రియను తమ కారులో తీసుకుని వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.