ఆగ్రహించిన రైతులు.. హైవేపై 2 గంటలు ధర్నా

by Shyam |
Farmers protest
X

దిశ, పరిగి: రెండ్రోజులుగా తిరుగుతున్నా.. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పరిగి మండలం హైదరాబాద్–బీజాపూజర్ అంతర్ రాష్ర్ట రహదారిపై విద్యారణ్య పురిగేటు వద్ద రోడ్డుకు అడ్డంగా బండరాళ్లను పెట్టి రైతులు రైతులు బైటాయించారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో హైవేపై వెళ్తున్న కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రైతులతో మాట్లాడి రైతులు ఆందోళన చెందవద్దని, ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. సిలిల్ సప్లయ్ చైర్మన్, కమిషనర్‌తో మాట్లాడామని, ఎక్కడికక్కడే పంక్షన్ హాల్స్ మాట్లాడి డీఎం ఆధ్వర్యంలోనే ధాన్యం కొనుగోలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అనంతరం విషయం తెలిసిన పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి మిల్లర్లతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యన్ని కూడా కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు ఎమ్మెల్యేలు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ధర్నా విరమించారు.

Advertisement

Next Story