- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రణక్షేత్రాన రైతులకు శాశ్వత నివాసాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు ఇప్పట్లో వారి పోరును ఆపేలా కనిపించడం లేదు. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేదాకా ఎన్నాళ్లైనా పోరాడతామని అంటున్నారు. ఈ మేరకు ఢిల్లీ సరిహద్దుల్లో శాశ్వత నివాసాలను ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ బార్డర్ వద్ద ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు. రైతుల కోసం కిసాన్ సోషల్ ఆర్మీ (కేఎస్ఏ) ఈ చర్యకు పూనుకున్నది. ఇప్పటికే అక్కడ 25 ఇళ్లను నిర్మించినట్టు నాయకుడు కేఎస్ఏ అధ్యక్షుడు అనిల్ మాలిక్ తెలిపారు. రాబోయే రోజుల్లో వేయి నుంచి 2 వేల దాకా ఇళ్లను నిర్మిస్తామనీ తెలిపారు. ఒక్కో ఇంటికి సుమారు రూ.25 వేల దాకా ఖర్చవుతుందని చెప్పారు. సిమెంటు, ఇటుకలతో ఈ ఇళ్లను నిర్మిస్తున్నామనీ, రైతుల మనోధైర్యంలానే ఇవి కూడా ఎక్కువకాలం మనగలుగుతాయని ఆయన అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గతేడాది నవంబర్ 26 నుంచి దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.