మే 26న బ్లాక్ డే.. మరోసారి రైతుల నిరసన

by Shamantha N |
మే 26న బ్లాక్ డే.. మరోసారి రైతుల నిరసన
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్లతో మొదలుపెట్టిన ఆందోళనలకు ఆరు నెలలు నిండుతున్న సందర్భంగా ఈ నెల 26న రైతులు దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. రైతుల ఆందోళనలకు సంఘీభావంగా సమాజంలోని ప్రతివర్గం బ్లాక్ డే పాటించాలని, ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇంటిపై, కార్యాలయాలపై, వ్యాపార సముదాయాలపై, బండ్లపై నల్లజెండా ఎగరేయాలని రైతు నేతలు కోరారు. రైతు నేతల పిలుపునకు 12 ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. రైతుల పిలుపునకు తాము మద్దతిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లపై మళ్లీ చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం రైతులతో మూర్ఖంగా వ్యవహరించవద్దని పేర్కొ్న్నాయి. సాగు చట్టాలను వెనక్కి తీసుకుని వారిని శాంతింపజేస్తే కరోనా మహమ్మారి బారిన పడకుండా రైతులు తమ స్వగ్రామాలకు వెళ్లిపోతారని, తదనంతరం మళ్లీ పంటలు పండిస్తారని వివరించాయి.

Advertisement

Next Story