- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు వేదికకు.. దళిత రైతు భూమి లాక్కుంటారా?
దిశ, కొమురవెల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు వేదికల నిర్మాణానికి దళితుల భూములు కావాల్సి వచ్చిందా అని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నక్కల యాదవ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం మర్రి ముచ్చల రైతు సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ఒక్కవైపు రైతు రాజ్యమని గొప్పలు చెప్పుకుంటూనే మరోవైపు రైతుల ఆత్మహత్యలకు కారణమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే భూ సమస్యలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికారులే దళితుల భూములను అభివృద్ధి పేరుతో స్వాధీనం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. రైతు వేదిక నిర్మాణం కోసం తన భూమి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ వర్గల్ మండలం వేలూరులో బేగరి నర్సింలు అనే దళిత రైతు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులపై అనేక రకాలుగా దాడులు చేస్తూ, వారి అభివృద్ధికి అడ్డంకిగా రాష్ట్ర ప్రభుత్వం మారిందని తీవ్రంగా మండిపడ్డారు.