- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెవెన్యూలో సిత్రాలు.. రైతన్నలకు కష్టాలు
దిశ,షాద్ నగర్: ధరణి పోర్టల్ రైతుల పాలిట అద్భుతవరం అని ప్రభుత్వం చెప్తున్నా.. అధికారులు, సిబ్బంది చేస్తున్న తప్పిదాల కారణంగా రైతులు మాత్రం అరిగోస పడుతున్నారు. ధరణి రికార్డుల్లో గల్లంతు అవుతున్న భూమితప్పిదాలు సరిచేయించుకునేందుకు తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని బాధితులు వాపోతున్నారు. అధికారులు, సిబ్బంది చేసిన పొరపాట్లు, నిర్లక్ష్యానికి తామెందుకు బలికావాలని ప్రశ్నిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా తమచేతిలో ఏమిలేదని ధరణిలో దరఖాస్తు చేసుకోండి.. సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి తహశీల్దార్‌లు చెబుతున్నారని సంవత్సరాలు గడిచినా సమస్యలు మాత్రం పరిష్కారం కావడంలేదని రైతులు వాపోతున్నారు. అధికారులు రికార్డులు రాయడంలో చేస్తున్న తప్పిదాలకు తాము శిక్షను అనుభవిస్తున్నామంటున్నారు.
షాద్ నగర్ నియోజకవర్గంలో కేశంపేట, ఫరూక్ నగర్, నందిగామ, కొత్తూరు, కొందుర్గు, చౌదరి గూడెం మండలాలు ఉన్నాయి. ఇక్కడ ఈమధ్య కాలంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. దీంతో అధికారుల తప్పిదాల వల్ల రైతులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది. ఉదాహరణకు కేశంపేట మండల పరిధిలోని పోమాల్ పల్లి గ్రామానికి చెందిన కర్నెకోట కసాబ్ కిషన్ జీ సర్వే నెంబర్ 247/ఆ4 లో 7గుంటలు, 247/ఆ/ఆ లో 4 గుంటలు 2020 డిసెంబర్లో ఇతరులకు విక్రయించాడు. అయితే రెవిన్యూ అధికారులు అతని ఆన్లైన్ రికార్డులలో విక్రయించిన ఈ సర్వే నెంబర్లతో పాటు 205/ఈలో 16 గుంటలు, 206/అలో 1ఎకరా 2గుంటలు సర్వే నెంబర్లు కూడా తొలగించారు.తొలగించిన భూమి ని తిరిగి ఎంట్రీ చేయాలంటూ తహశీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఇలాంటి ఎన్నో సమస్యలు రైతులు నిత్యం ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. ధరణి పోర్టల్ భూముల విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు రావడం, సర్వే నంబర్లు మిస్ అవడం, పట్టాభూములు నిషేధిత జాబితాలో చేరడం, వివిధ కారణాలతో డిజిటల్ సిగ్నేచర్ కాకపోవడంతో పాస్‌బుక్ జారీలో అంతరాయం వంటి ఎన్నోసమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం..
అధికారులు రెవిన్యూ రికార్డుల నమోదులో చేస్తున్న తప్పిదాల కారణంగా తాము శిక్షను అనుభవిస్తున్నామని, సరిచేయమంటే మాచేతుల్లో లేదని తహాసీల్దార్ అంటున్నారు.రైతులు కార్యాలయాల చుట్టూ తిరగొద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ధరణి ని తెస్తే అధికారులు తప్పిదాలు చేస్తూ సంవత్సరాల పాటు కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేస్తున్నారు.
కర్నెకోట కసాబ్ కిషన్ జీ,రైతు.