ఆఫీసర్లతో రైతులు వాగ్వాదం

by Shyam |   ( Updated:2021-07-14 08:51:22.0  )
ఆఫీసర్లతో రైతులు వాగ్వాదం
X

దిశ, పర్వతగిరి: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కొంకపాక శివారులో సర్వే నెంబర్ 213లో ఉన్న అసైన్డ్ భూమిలో గత కొన్ని సంవత్సరాలుగా కొందరు రైతులు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ భూమిలో 10 ఎకరాల విస్తీర్ణంలో మెగా పార్క్ ఏర్పాటుకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం ఆ భూమిలో మొక్కలు నాటడం కొరకు డిఆర్‌డిఎ పీడి సంపత్ రావు, తహసిల్దార్ మహబూబ్ అలీ ఆధ్వర్యంలో 20 వేల మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నారు.

మొక్కలు నాటే ప్రయత్నం చేయగా.. అక్కడే సాగు చేస్తున్న రైతులు కొందరు వారితో వాగ్వాదానికి దిగారు .తమ పంట పొలాల్లో మొక్కలు నాటితే.. వాటిని పీకేస్తామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని ధ్వంసం చేసినట్లు అయితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆఫీసర్లు హెచ్చరించారు. కాగా మీరే మాకు పట్టాలు ఇచ్చి అవి దొంగ పట్టాలు అంటే ఎలా? అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed