క్యూట్ లవ్ లిరికల్ సాంగ్ ‘ఆనందమాయే’ రిలీజ్

by Hamsa |   ( Updated:2025-01-09 14:40:47.0  )
క్యూట్ లవ్ లిరికల్ సాంగ్ ‘ఆనందమాయే’ రిలీజ్
X

దిశ, సినిమా: సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌తో 100% స‌క్సెస్ రేటుని సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్(Swadharm Entertainment) బ్యాన‌ర్ నుంచి రానున్న నాలుగో సినిమా ‘బ్రహ్మా ఆనందం’(Brahma Anandam). ఇందులో హాస్య బ్రహ్మ పద్మశ్రీ అవార్డ్ గ్రహీత బ్రహ్మానందం(Brahmanandam), ఆయ‌న‌ కుమారుడు రాజా గౌతమ్(Raja Gautam) ప్రధాన పాత్రల్లో న‌టించారు. అయితే ఈ సినిమాలో ప్రియా వడ్లమాని(Priya Vadlamani), ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్ న‌టించగా.. డెబ్యూ డైరెక్టర్‌ ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్ ద‌ర్శక‌త్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని రాహుల్ యాద‌వ్ న‌క్కా(Rahul Yadav Nakka) నిర్మిస్తున్నారు. యూనిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ ప్రేక్షకుల‌ను అల‌రించ‌టానికి సిద్ధమ‌వుతోంది. అయితే ‘బ్రహ్మా ఆనందం’ మేక‌ర్స్ ప్రమోష‌న్స్‌లో జోరు పెంచారు. ఇందులో భాగంగా ఈ చిత్రం నుంచి ‘ఆనందమాయే..’(Anandamaye) అనే లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. పాటను గమనిస్తే.. ఇది క్యూట్ లవ్ సాంగ్ . ఇందులో హీరోపై త‌న ప్రేమ‌ను హీరోయిన్ అందంగా వివ‌రిస్తుంటే, హీరో మాత్రం త‌న‌కు డ‌బ్బు మీదున్న ప్రేమ‌, అవ‌స‌రాన్ని పాట‌గా పాడుకుంటారు.



Advertisement

Next Story