కోహ్లీ రిటైరైతే భారత్‌కు భారీ నష్టం : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్

by Harish |   ( Updated:2025-01-09 15:13:46.0  )
కోహ్లీ రిటైరైతే భారత్‌కు భారీ నష్టం : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే భారత జట్టుకు భారీ నష్టమని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ చెప్పాడు. కొంతకాలంగా టెస్టుల్లో కోహ్లీ రాణించడం లేదు. ఇటీవల ఆస్ట్రేలియా టూరులో తొలి టెస్టులో శతకంతో మెరిచినప్పటికీ మిగతా మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. దీంతో అతని రిటైర్మెంట్‌పై పలు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో క్లార్క్ స్పందిస్తూ.. కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. విరాట్ రిటైర్ కావాలని కోరుకోవడం లేదని, అతను తన టీమ్‌లో ఉంటే అతని కోసం పోరాడుతానని వ్యాఖ్యానించాడు. ‘ప్రస్తుతం కోహ్లీ ఫామ్‌లో లేకపోవచ్చు. కానీ, రేపటి రోజు డబుల్ సెంచరీ చేయగల సమర్థుడు. కోహ్లీ ఆడేంతవరకు అతన్ని ఆడించాలి. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు పలికితే నష్టపోయే జట్టు టీమిండియానే.’ అని తెలిపాడు.

Advertisement

Next Story