- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సత్తుపల్లి లో 114 మంది బైండోవర్
దిశ,సత్తుపల్లి : సత్తుపల్లి మండల పరిధిలో ఇప్పటి వరకు 114 మందిని బైండోవర్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందాలను నివారించే దిశగా కఠిన చర్యలు చేపట్టామని సత్తుపల్లి ఇన్స్‌పెక్టర్ కరణ్ అన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు కోడిపందేలను నియంత్రించేందుకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పేకాటరాయుళ్లు, కోడిపందెం కేసుల్లో ఉన్న పాత నిందితులను, కోడి కత్తులను తయారు చేసేవారు, కోడి కత్తులు కట్టేవారు కలిపి 114 మందిని మెజిసేట్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు సత్తుపల్లి పట్టణం సీఐ కిరణ్ తెలిపారు.
బుధవారం 54 మందిని, గురువారం 63 మందిని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, కోడిపందేలు, పేకాట నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడి పందేలు నిర్వహించకుండా మండల, గ్రామస్థాయిలో నిఘా ఏర్పాటు చేసి నిలువరించేలా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందేలు, జూదం నిర్వహణకు తోటలు, భూములు, గెస్ట్ హౌస్ లు ఇచ్చి ప్రోత్సహించే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.