- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మమ్మల్ని నీట ముంచి.. ప్రాజెక్టు కడతారా?
దిశ, భద్రాచలం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన సీతమ్మ సాగర్ బహుళ ప్రయోజక ప్రాజెక్టు పనులు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చర్ల మండలంలో ముంపు రైతులు ఆందోళన చేపట్టారు. మంగళవారం చర్ల-భద్రాచలం ప్రధాన రహదారి అయిన దేవరాపల్లి వద్ద రైతులు రోడ్డపై బైఠాయించారు. దీంతో రెండు వైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తమ జీవనాధారమైన పంట పొలాలను నీట ముంచే సీతమ్మ సాగర్ మాకొద్దు అంటూ రైతులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. మమ్మల్ని నీట ముంచి ప్రాజెక్టు కడతారా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నష్టపరిహారం ఎంత ఇస్తారనేది ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన చేయకుండా భూములు స్వాధీనం చేసుకోవాలనుకోవడం సరైంది కాదన్నారు. కరకట్టలో కోల్పోయిన భూమికి ప్రభుత్వం ఎంత పరిహారం ఇస్తుందో తేటతెల్లం చేయాలని డిమాండ్ చేశారు.
పంట పొలాల్లో కరెంట్ మోటార్లు, పైపులైన్లు, షెడ్లు, కుండీలు కోల్పోతున్నామని ముంపు రైతులు తెలిపారు. సంబంధిత అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ తమ ఆందోళన విరమించబోమని రైతులు వెల్లడించారు. అధికారులు స్పందించకుంటే సీతమ్మ సాగర్ పనులకు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నిరసనలో నాలుగు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొనగా, ఆందోళనకు రైతు ప్రతినిధులు కొప్పినీడు బాబూరావు, సాగి రామచంద్రరాజు, నల్లపురాజు నీలాద్రి వర్మ, పెన్మత్స సీతాపతిరాజు, సర్పంచ్ కారం సమ్మయ్య, ఉప సర్పంచ్ తెల్లం జగపతిరావు, తెల్లం లక్ష్మీనారాయణ, కారం కృష్ణమూర్తి, సత్యం, మొగిలి, మంతెన కృష్ణంరాజు తదితరులు నాయకత్వం వహించారు.