కెనాల్ పక్కన రైతులు ఆ పని చేస్తున్నా.. పట్టించుకోని అధికారులు

by Shyam |   ( Updated:2021-12-01 02:51:15.0  )
కెనాల్ పక్కన రైతులు ఆ పని చేస్తున్నా.. పట్టించుకోని అధికారులు
X

దిశ, ఆత్మకూర్: వ్యవసాయ భూములకు సాగునీరు అందించే ఎస్సారెస్పీ కెనాల్ డీబీఎం 41 కబ్జాకు గురవుతుంది. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్, హౌస్ బుజుర్గ్ గ్రామాలలో ఉండే కెనాల్ కాలువను, కాలువ పక్కనున్న రైతులు కొంతమంది ఇష్టారీతిన కబ్జాలకు పాల్పడుతుండడంతో ఆ దారిపొడవునా వ్యవసాయ భూములకు వెళ్లాల్సిన మిగతా రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు కబ్జా చేస్తూ, కాలువలు సైతం పూడ్చి వేస్తున్నా ఎస్సారెస్పీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ స్పందించకపోవడం పట్ల పలు విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సారెస్పీ కెనాల్ కాలువ కబ్జాకు గురి కాకుండా కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed