రైతులను అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

by Anukaran |   ( Updated:2020-11-27 03:44:02.0  )
రైతులను అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల పై ఉత్తర భారతదేశంలో ఆందోళనలు తారా స్థాయికి చేరాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ధర్నాలు హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో యుద్ధవాతవరణానికి తెరలేపాయి. నేడు చలో ఢిల్లీకి రైతులు పిలుపునిచ్చారు. దీంతో హర్యానా సరిహద్దు నుంచి ర్యాలీగా బయల్దేరిన సమయంలో భద్రతా బలగాలు రైతులను అడ్డుకున్నాయి. రైతులు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో సింఘ దగ్గర పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఇప్పటికే గత రెండ్రోజులుగా పంజాబ్, హర్యానా సరిహద్దులు మూసివేయడంతో.. రైతులు అక్కడే బైఠాయించారు. ఈ పరిణామాల మధ్య అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Advertisement

Next Story