- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతీయ రహదారిపై రైతుల ధర్నా
by Shyam |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని టెక్రియాల్ వద్ద జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. గురువారం రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. అనంతరం రైతులు ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. సన్నరకం వరికి మద్దతు ధర ప్రకటించాలని.. మొక్కజొన్న క్వింటాల్‌కు రూ. 1,860 చెల్లించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రైతు వేదిక నాయకులు మాట్లాడుతూ… ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ సాగు పేరిట సన్నరకం వరి పండించి కోతలు వచ్చిన దానికి మద్దతు ధర ప్రకటించలేదని విమర్శించారు. సన్నరకం వరికి క్వింటాల్‌కు రూ.2,500 చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఆకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులకు పరిహరం ఇచ్చి అదుకోవాలని కోరారు.
Advertisement
Next Story