ఖట్టర్‌కు రైతుల ఆందోళనల సెగ

by Shamantha N |   ( Updated:2021-01-10 05:31:40.0  )
ఖట్టర్‌కు రైతుల ఆందోళనల సెగ
X

దిశ,వెబ్‌డెస్క్: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు రైతుల ఆందోళన సెగ తగిలింది. కామ్లి గ్రామంలో మహాపంచాయత్ పేరుతో సీఎం బహిరంగ సభను ఆదివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభలో వ్యవసాయ చట్టాలను రైతులకు వివరించాలని సీఎం అనుకున్నారు. కాగా సీఎం రాకను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన నిర్వహించారు.

హెలిప్యాడ్ ధ్వంసం చేసేందుకు రైతులు యత్నించారు. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో కార్యక్రమాన్ని సీఎం ఖట్టర్ రద్దు చేసుకున్నారు.

Advertisement

Next Story