MRO ఆఫీసులో ఉద్రిక్తత.. తహసీల్దార్‌పై డీజిల్ పోసిన రైతు

by Shyam |   ( Updated:2021-06-29 05:37:57.0  )
Shivvampet-Mro
X

దిశ‌, న‌ర్సాపూర్‌ : మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని శివ్వంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తహసీల్దార్ భానుప్రకాశ్‌పై తాళ్లపల్లి తండా రైతులు డీజిల్ పోయడంతో ఆఫీసులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వివరాల ప్రకారం.. సోమవారం తాళ్లపల్లి తండాకు చెందిన రైతు మాలోత్‌ బాలు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. మృతి చెందిన రైతుకు తహసీల్దార్.. గ‌త ఏడు సంవ‌త్సరాల నుంచి పట్టా పాసుపుస్తకాలు ఇవ్వకపోవడంతో.. రైతు బీమా రాద‌ని గ్రహించి తాండాకు చెందిన రైతులు ఆగ్రహంతో మృతదేహన్ని ట్రాక్టర్‌లో శివ్వంపేట తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి కార్యాల‌యం ఎదుట ఆందోళన చేపట్టారు.

రైతులు ఆందోళన చేస్తున్నా.. తహసీల్దార్ భాను ప్రకాష్ పట్టించుకోకపోవడంతో కార్యాలయం నుంచి బయటకు వెళ్తున్న తహసీల్దార్‌పై రైతులు డీజిల్ పోశారు. అనంతరం, రైతులు సైతం వారిపై డీజిల్ పోసుకుని ఆత్మహ‌త్యయ‌త్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో త‌హ‌సీల్దార్‌తో రైతులు వాగ్వీవాదానికి దిగారు. దీంతో, త‌హ‌సీల్దార్ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ‌త ఏడు సంవ‌త్సరాల నుంచి పాసు పుస్తకం కోసం అధికారుల చుట్టు తిరిగినా.. ఇంత వ‌ర‌కు రాలేద‌ని ఆరోపించారు. బాలు చ‌నిపోతే రైతు బీమా రాద‌ని అన్నారు. పాసు పుస్తకం ఉంటే రైతు బీమా వ‌చ్చేద‌ని పేర్కొన్నారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకొని రైతుల‌కు న‌చ్చజెప్పారు.

Shivvampet-Mro-Office

టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి.. ఆ మాజీ మంత్రి చూపు ఎటువైపు?

Advertisement

Next Story

Most Viewed