గన్నీ బ్యాగుల కోసం రైతుల పడిగాపులు..

by Shyam |
Farmers
X

దిశ, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి సొసైటీ పరిధిలోని బుల్కాపూర్ గ్రామంలో గన్నీ బ్యాగుల కోసం రైతులు ఉదయం నుంచి క్యూలో నిలబడ్డారు. శంకర్పల్లి సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు ఖాళీ సంచులు పంపిణీ చేస్తుండడంతో ఉదయం 6 గంటల నుంచే రైతులు క్యూ కట్టారు. లాక్‌డౌన్ ఉండటంతో రైతులు లైన్‌లో నిల్చోకుండా.. చెప్పులను వరుసలో పెట్టి వేచి చూస్తున్నారు. ఖాళీ సంచుల కోసమే ఇంతపెద్ద క్యూ లైన్ ఉండడంతో తమకు ఈరోజు అవకాశం వస్తుందా? లేదా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సొసైటీల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులు పండించిన ధాన్యాన్ని తరలించేందుకు ఖాళీ సంచుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నోట్ల రద్దు సమయంలో కూడా లైన్‌లో వ్యక్తులు నిల్చోకుండా.. చెప్పులు పెట్టిన సందర్భం గుర్తుచేస్తున్నారు.

Advertisement

Next Story