యాదాద్రిలో ఉరేసుకున్న అన్నదాత..

by Sumithra |   ( Updated:2021-12-15 08:46:07.0  )
యాదాద్రిలో ఉరేసుకున్న అన్నదాత..
X

దిశ, భువనగిరి రూరల్ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ముద్దాపురం గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. ఓ వైపు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు యాసంగిలో వరి పంట వేయొద్దంటూ రైతులను ఆందోళనకు గురిచేస్తుంటే.. మరోవైపు పత్తి రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు.

తాజాగా ముద్దాపురం గ్రామంలో వార్డు మెంబర్‌గా కొనసాగుతున్న నరసింహ (43) గత నాలుగేళ్లుగా పత్తి పంట సాగుచేస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వలన పంట మొత్తం మునిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం అయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు తిరిగి చెల్లించాలని బలవంతం చేయడంతో మనస్తాపం చెందిన రైతు ఈరోజు తన సొంత వ్యవసాయ బావి వద్ద గల కొట్టంలో ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఒక కూతురు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పంచనామా నిర్వహించి రామన్నపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story