- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నివర్’ ధాటికి అన్నదాత విలవిల
దిశ, ఏపీ బ్యూరో: నివర్ తుఫాన్ ధాటికి అన్నదాత విలవిల్లాడుతున్నాడు. చేతికొచ్చే దశలో పంటలు నేలమట్టమయ్యాయి. అప్పులు తీర్చే మార్గం లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. భారీ వర్షాలు, పెనుగాలులకు రాష్ట్ర వ్యాప్తంగా 2,14,420 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతిన్నది. 13 వేల హెక్టార్లలో మినుము పంట నీళ్లలో కుళ్లిపోయింది.
మరో 5 వేల హెక్టార్లలో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఐదు వేల ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 3,500 ఎకరాలు, కృష్ణ జిల్లాలో సుమారు 45 వేల హెక్టార్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 21,234 హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.