వీళ్లు రైతును హత్య చేసిన్రు… వాళ్లు ఇల్లు, ట్రాక్టర్ కాలబెట్టిన్రు

by Anukaran |
వీళ్లు రైతును హత్య చేసిన్రు… వాళ్లు ఇల్లు, ట్రాక్టర్ కాలబెట్టిన్రు
X

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రౌతుగూడెం తండాలో హత్యోందంతంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పొలంగట్టు వివాదంలో ఆంగోతు బాలు అనే వ్యక్తిపై ప్రత్యర్థులు బాబూలాల్, హతీరామ్ దాడికి పాల్పడ్డారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన మృతుడి బంధువులు ప్రత్యర్థి హతీరామ్ ఇంటిని, ట్రాక్టర్ ను తగలబెట్టారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నారు.

Advertisement

Next Story