మోటారు సైకిలే ఎద్దాయే..

by Aamani |   ( Updated:2021-06-23 21:55:32.0  )
Cultivation With Bike in adilabad
X

దిశ,బోథ్ : తను ఓ పేద రైతు భూమి ఉంది కానీ దున్నుడానికి ఎద్దులు లేవు. ఎలా దున్నాలి అని ఆలోచించి చివరికి ఇలా చేశాడు వివరాలకు వెళ్తే.. బజార్హత్నుర్ మండల కేంద్రానికి చెందిన మేకల మల్లేష్ అనే రైతుకు ఎద్దుల జత లేదు. దీంతో అతను తన పంటపొలంలో దౌర కొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఒకరోజు మొత్తం దౌర కొట్టాలంటే 2000ల రూపాయిలు ఖర్చు అవుతాయి. కానీ అతను కొంచె కొత్తగా ఆలోచించి తన దగ్గర ఉన్న మోటారు సైకిల్ సహాయంతో దౌర కొట్టేశాడు. లీటర్ పెట్రోల్‌తో ఒక ఎకరం 20 గుంటల భూమిలో దౌర కొట్టేశాడు. దీంతో మనిషి తలుచుకుంటే చేయలేనిది ఏది లేదని నిరూపించాడు మల్లేష్.

Advertisement

Next Story