- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిడ్డ పెళ్లికి కూడబెట్టిన సొమ్ము.. ఆక్సిజన్ సిలిండర్లకు
దిశ, ఫీచర్స్: దేశవ్యాప్తంగా నెలకొన్న కొవిడ్ విపత్కర పరిస్థితులు ప్రతీ ఒక్కరి కలలు, భవిష్యత్ ప్రణాళికలపై ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పిల్లల చదువులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడిగా ప్రిపేర్ అవుతున్న యువత ఆశలన్నీ అడియాశలవుతుండగా.. అనేక పెళ్లిల్లు వాయిదాపడుతున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న కల్లోలాన్ని చూస్తుంటే.. ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితులే కనిపిస్తు్న్నాయి. ఈ క్రమంలో ఆక్సిజన్ సిలిండర్ల కోసం బాధితుల కష్టాలను చూసి చలించిన ఓ రైతు.. తన కూతురి పెళ్లి కోసం కూడబెట్టిన డబ్బులను విరాళంగా ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నాడు.
మధ్యప్రదేశ్, నేముచ్ జిల్లాలోని గ్వాల్ దేవియాన్ గ్రామానికి చెందిన చంపాలాల్ గుర్జార్ అనే రైతు రెండు ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు కోసం రూ. 2 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ మయాంక్ అగర్వాల్‌కు అందజేశారు. నిజానికి ఆదివారం జరిగిన తన కూతురి పెళ్లి రిసెప్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేసిన గుర్జార్.. ఇందుకోసం రూ. రెండు లక్షలు దాచిపెట్టాడు. కానీ ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతతో కరోనా పేషెంట్లు పడుతున్న అవస్థలు చూసి చలించిపోయిన ఆయన, తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ మేరకు రిసెప్షన్ కోసం దాచిన డబ్బులను నేముచ్ జిల్లా కలెక్టర్‌కు అందజేశాడు. రెండు సిలిండర్లలో జిల్లా ఆస్పత్రికి ఒకటి, తానుంటున్న జీరన్ తహసీల్‌కు మరొకటి డొనేట్ చేశాడు గుర్జార్.
కాగా, తండ్రి నిర్ణయాన్ని కలెక్టర్‌తో పాటు కూతురు అనిత కూడా ప్రశంసించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్-19 పేషెంట్ల చికిత్సకు ఆక్సిజన్ అత్యవసరమని, మా నాన్న చేసిన పని సంతృప్తిని ఇచ్చిందని వెల్లడించింది. ఈ సందర్భంగా మాట్లాడిన గుర్జార్.. తనలాగే ప్రతిఒక్కరూ సాయం చేసేందుకు ముందుకొస్తే, ఈ మహమ్మారిని సులభంగా జయించవచ్చని అన్నారు.