- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి నిర్లక్ష్యంతో రైతు మృతి
దిశ, దుబ్బాక :
విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లో కెళితే…దౌల్తాబాద్ మండలకేంద్రంలో వ్యవసాయ పొలానికి వెళ్ళే క్రమంలో రైతు పద్మిని రాములు (48)విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఆ దారిలో విద్యుత్ వైర్లు తెగి కింద పడిపోయి ఉన్నాయని పదిరోజులుగా విద్యుత్ అధికారులకు చెబుతున్నా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. రోజు మాదిరిగా ఈ రోజు కూడా రైతు రాములు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళే క్రమంలో రోడ్డుకు అడ్డంగా కరెంటు వైరు ఉండడం గమనించాడు. వైర్లను పక్కకు నెట్టే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. పది రోజులుగా ఆ కరెంటు వైర్లకు విద్యుత్ నిలిపివేశారని వారు తెలిపారు. ఈరోజు ఆ సమయంలో ఎవరో కరెంటు వేయడంతో కరెంటు షాక్ తగిలిందని వారు అన్నారు. ఈ ఘటన కేవలం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని స్థానికులు చెబుతున్నారు.