- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కన్నీరు పెట్టిస్తున్న రైతు సూసైడ్ లేఖ.. కేసీఆర్ పాలనకు సాక్ష్యం ఇదే..
దిశ, మెదక్: ప్రస్తుత పరిస్థితిల్లో రైతు కష్టం వర్ణనాతీతం. ఎంతో మంది తమ ధాన్యం అమ్ముడుపోకపోవడంతో ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఓ రైతు సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఆ సూసైడ్ నోట్ చదివితే సామాన్య రైతు కష్టం, అతని ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు. ఆరు గాలం శ్రమించి పంట పండిస్తే రైతుకు మిగిలింది ఆత్మహత్య. సన్న రకం వడ్లు పండించి పెట్టుబడి రాక పండిన పంట ధాన్యం కొనుగోలు చేయక పోవడంతో రైతు మనస్థాపం చెంది, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా బోగడ భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు, గ్రామస్తుల,కథనం ప్రకారం.. జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్‌లో వ్యవసాయ రైతు రవికుమార్ (50) సన్న రకం వడ్లు పండించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో తనకున్న ఐదెకరాలలో సన్న రకం వడ్లు వేశారు. పండిన పంట కొనుగోలు కేంద్రాలకు తీసుకపోతే అక్కడ నిరాశే ఎదురైంది. పంట దిగుబడి తగ్గిపోయింది, తెచ్చిన అప్పులు పేరుకుపోయాయి. దీంతో మనస్థాపం చెందిన రైతు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లిఖితపూర్వకంగా రెండు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నదాత రవికుమార్ చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
భారీగా పంట దిగుబడి.. కొనుగోళ్లపై ప్రభుత్వాల నిర్లక్ష్యం..
మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు సన్న రకం వరి ధాన్యాన్ని అధికంగా పండించారు. కొనుగోలు కేంద్రాలలో నెలల తరబడి వేచి ఉన్న రైతులు, తెచ్చిన ధాన్యాన్ని కొనక పోవడంతో రైతులు ఆందోళన చెంది, అప్పు చెల్లించ లేక, ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు ఆందోళన చెందుతూ, కొన్ని చోట్ల పండించిన వరి ధాన్యానికి నిప్పు పెడితే , మరికొన్ని చోట్ల రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం.