- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్చ్.. యువరైతుకు మరో దారి కనిపించలేదా.. ఎంత పని చేశాడు
దిశ, కుబీర్: సుద్ధవాగు బ్యాక్ వాటర్‌లో దూకి యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు తానూర్ మండలం బెల్తరోడా గ్రామానికి చెందిన పురంశెట్టి శివకుమార్(21). ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా శివకుమార్‌కు చెందిన రెండెకరాల(కూరగాయల సాగు) పంట నీట మునిగింది. అప్పులు తీసుకొచ్చి కూరగాయల పంటపై పెట్టుబడి పెడితే కొట్టుకుపోయిందన్న దిగులుతో ఉన్న శివకుమార్ శనివారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు వెతుకులాట ప్రారంభించారు.. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇదే సమయంలో ఆదివారం లింగి గ్రామం వద్దనున్న సుద్ధవాగు బ్యాక్ వాటర్ బ్రిడ్జిపై శివకుమార్ బైక్ కనిపించింది. పంట నష్టం జరిగిందన్న బాధలో సుద్ధవాగులో దూకి ఉంటాడని భావించిన కుటుంబీకులు, స్థానిక జాలరులు నీటిలో గాలించారు. చివరకు మృతదేహాన్ని బయటకు తీశారని.. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు వివరణ ఇచ్చారు.