మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య….

by Shyam |
మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య….
X

దిశ ప్రతినిధి, మెదక్: ధరణి సర్వే బృందం తన ఫోటోను తీసుకోలేదని మనస్తాపం చెంది ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే…..కంది మండలం ఇంద్రకరణ్ గ్రామానికి చెందిన నందిగామ శంకరయ్య (68), అతని అన్నకు కలిపి ఉమ్మడి ఆస్తి ఉంది. అయితే ఆ ఆస్తి అతని అన్న పేరిట ఉంది. దీంతో ధరణి సర్వేకు వచ్చిన వాళ్ళు అతని అన్న ఫోటోను తీసుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కాగా గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకుని శంకరయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. తన అన్న ఫోటోను తీసుకోని తన ఫోటోను తీసుకోక పోవడంతో శంకరయ్య మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

అయితే ఉమ్మడి ఆస్తి అయినప్పటికీ వారి వారసత్వ ఆస్తులు, ఇళ్లు, ఇతర ఖాళీ స్థలం శంకరయ్య అన్న పేరిటే ఉంది. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరి పేరు మీద ఆస్తి ఉంటే వారి ఫోటో మాత్రమే తీసుకుంటున్నారు. అందుకే శంకరయ్య అన్న ఫోటోను మాత్రమే సర్వే బృందం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సర్వే రిపోర్టులో శంకరయ్య పేరు, ఆధార్ నెంబర్ నమోదు చేసినట్లు సర్వే అధికారులు చెబుతున్నారు. కానీ ఫోటో తీసుకోకపోవడంతో తన పేరిట ఉన్న ఖాళీ స్థలం దక్కుతుందో లేదోనన్న ఆందోళనతో శంకరయ్య ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed