వ్యవసాయ ఎగుమతుల్లో వృద్ధి

by  |   ( Updated:2021-02-05 07:05:33.0  )
వ్యవసాయ ఎగుమతుల్లో వృద్ధి
X

దిశ,వెబ్‌డెస్క్: 2020లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదికన భారత వ్యాపార ఎగుమతులు 15.5 శాతం క్షీణించాయి. అయితే, ఇదే కాలంలో వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం 9.8 శాతం పెరగడం విశేషం. కొవిడ్-19 మహమ్మారి కారణంగా గతేడాది ఎగుమతులు, దిగుమతులపై భారీగా ప్రభావం ఉంది. కానీ, క్లిష్ట పరిస్థితుల మధ్య కూడా వ్యవసాయ రంగంపై ఆ ప్రభావం కనిపించలేదు.

పైగా, వ్యవసాయ రంగం వృద్ధి నమోదైంది. సమీక్షించిన కాలంలో మొత్తం ఎగుమతులు సుమారు రూ. 14.89 లక్షల కోట్లుగా నమోదైంది. 2019 ఇదే కాలంలో మొత్తం ఎగుమతులు సుమారు రూ. 17.6 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అలాగే, వ్యవసాయ రంగ ఉత్పత్తుల ఎగుమతులు 2019లో సుమారు రూ. 1.94 లక్షల కోట్ల నుంచి గతేడాది సమీక్షించిన కాలంలో రూ. 2.13 లక్షల కోట్లకు పెరిగాయి.

Advertisement

Next Story

Most Viewed