ప్రపంచకప్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కొత్తమాట

by Shyam |
ప్రపంచకప్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కొత్తమాట
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ప్రపంచ కప్ నిర్వహించడం సాధ్యం కాదని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అధ్యక్షుడు ఎడ్డింగ్స్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా సీఏ తాత్కాలిక సీఈవో నిక్ హోక్లే ప్రపంచకప్‌కు ప్రేక్షకులను అనుమతిస్తామని, అన్నీ కుదిరితే షెడ్యూల్ ప్రకారమే జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 15 జట్లతో టీ20 వరల్డ్‌కప్ నిర్వహించడం కష్టమే. అయినా సీఏ సాధ్యమైనంత వరకు ప్రపంచకప్‌ను వాయిదా వేయబోదని అన్నారు. మెగా టోర్నీని ప్రేక్షకులు లేకుండా జరపడం అంత మంచిది కాదు. కానీ, ఆస్ట్రేలియా ప్రభుత్వం సడలించిన నిబంధనల మేరకు 40శాతం ప్రేక్షకులను అనుమతిస్తామని చెప్పారు. మరోవైపు టీ20 వరల్డ్ కప్‌పై జూలై మొదటి వారంలో ఐసీసీ తమ నిర్ణయం చెప్పనున్నది.

Advertisement

Next Story

Most Viewed